‘నా సామిరంగా’లో అల్లరి నరేశ్‌…!?

చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న పూర్తిస్థాయి మాస్‌ చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్‌ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో స్టార్‌ కాస్ట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ అంజి అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటోచ్చేత్తది అంటూ రాసుకొచ్చింది.

ఇక అంజి గాడికి సంబంధించిన స్పెషల్‌ ఇంట్రో ప్రోమోను రేపు ఉదయం 10.18 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట చూస్తే.. హీరో హీరోయిన్ల మధ్య సాగే కలర్‌ ఫుల్‌ ట్రాక్‌ సినిమాకు హైలెట్‌ కానుందని విజువల్స్‌ చెబుతున్నాయి. ఈ మూవీకి ఆస్కార్స్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.