అమ్మ బాబోయ్.. రోజాను ఎత్తుకుని తిప్పేసిన అల్లరి నరేష్

Allari Naresh Dance with Roja In Extra Jabardasth

అల్లరి నరేష్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. చాలా ఏళ్ల తరువాత సక్సెస్ అనే పదాన్ని విన్నాడు. నాంది సినిమాతో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అల్లరి నరేష్ నుంచి ఎటువంటి సినిమాలు కోరుకుంటున్నారో ఇప్పటికి తెలుసుకున్నాడు. నాంది సినిమా అల్లరి నరేష్ కెరీర్‌కు నాంది పలికింది. అలా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లరి నరేష్, డైరెక్టర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో గెస్ట్‌లు వచ్చారు. వచ్చే వారం రాబోతోన్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది.

Allari Naresh Dance with Roja In Extra Jabardasth
Allari Naresh Dance with Roja In Extra Jabardasth

ఈవీవీ తెరకెక్కించిన సీతారత్నం గారి అబ్బాయి సినిమాతోనే రోజా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నరేష్ స్కూల్‌కి వెళ్లేవాడట. అప్పుడు నరేష్‌ను ఎత్తుకుని తాను తిరిగేదాన్నంటూ రోజా చెప్పుకొచ్చింది. అయితే అప్పుడు తాను అలా ఎత్తుకుంటే.. ఇప్పుడు నన్ను ఇలా ఎత్తుకుని ఆడుకుంటున్నాడంటూ అల్లరి నరేష్ మీద కౌంటర్ వేసింది. అలా అల్లరి నరేష్ ఒక్కసారిగా రోజాను ఎత్తుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

నువ్వా నేనా సినిమాలోని సర్ర మేరా దిల్లు లూట్ గయ్ అనే పాటకు అల్లరి నరేష్, రోజాలు స్టెప్పులు వేశారు. చివరకు రోజాను అమాంతం ఎత్తుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. రోజా గారితో నటించాను కానీ ఆమె పక్కన హీరోగా చేయలేదు.. అందుకే ఇలా షోకు వచ్చినప్పుడు ఫీల్ అవుతానని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. మొత్తానికి రోజా నరేష్ మాత్రం జబర్దస్త్ షోలో దుమ్ములేపేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.