ఇక పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ సినిమాపైనే..

త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేసిన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అంచనాలను అందుకోలేదు అని విభిన్నమైన రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించగా అతని పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకున్న బ్రో సినిమా సక్సెస్ కావాలి అంటే మరో 50 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే అందుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం వస్తున్న టాక్ బట్టి సినిమా వీకెండ్ తర్వాత ఎలాంటి నెంబర్స్ క్రియేట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. బ్రో విషయంలో పూర్తిస్థాయిలో అయితే ఫాన్స్ సంతృప్తి చెందలేదు అని అనిపిస్తోంది. ఇక ఆశలన్నీ ఓజీ సినిమా పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను యుదర్శకుడు సుజిత్ డిఫరెంట్ మాఫియా బ్యాక్ డ్రాప్లో తీసుకు వస్తున్నాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించబోతున్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నారు.

తప్పకుండా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని అనిపిస్తుంది. OG పై ఇప్పటికే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక సినిమా షూటింగ్ కూడా త్వర త్వరగా ఫినిష్ అవుతుంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో అంతగా ఫ్యాన్స్ కు అయితే కిక్కు రాలేదు. ఇక బ్రో సినిమా కూడా ఆశలను ఆవిరి చేసింది. మరి OG సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.