గంగుబాయి కతీయవాడి సినిమాలో అన్ని వాస్తవాలే… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరుచూరి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఈయన రచయితగా, దర్శకుడిగా, నటుడిగా పలు సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా పరుచూరిపలుకులు అనే కాన్సెప్ట్ ద్వారా కొత్తగా విడుదలైన సినిమాల గురించి ఈయన విశ్లేషించి ఆ సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన గంగుబాయి కతియవాడి సినిమా గురించి స్పందించారు.

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పరుచూరి మాట్లాడుతూ..ముంబయి మాఫియా మహిళాడాన్‌గా పేరు పొందిన గంగూబాయి జీవితాన్ని ఆధారంగా తెరికెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఈయన తెలియజేశారు. ప్రేమలో మోసపోయి వేశ్యగా మరి అంధకారంలో ఉన్నటువంటి ఎంతోమంది వేశ్యలకు నాయకురాలిక వ్యవహరిస్తూ వారి జీవితాలను కాపాడిన ఓ గొప్ప వ్యక్తిగా గంగుబాయి నటించారు. అయితే ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చినప్పటికీ ఇలాంటి అద్భుతమైన విషయాన్ని తెలుగు సినిమాల అందుకోలేకపోయాయి.

అంధకారంలో ఉన్నటువంటి ఎంతో మంది వైశ్య మహిళల జీవితాలను కాపాడటం కోసం గంగుబాయి ఏకంగా ప్రధానమంత్రి తోనే పోటీపడి వారందరిని కాపాడటం చివరికి ఎవరైతే తనని వేశ్య అని హేళన చేశారో వారి చేత పూలు చల్లించుకోవడం చాలా అద్భుతంగా ఉందని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎంతో అద్భుతంగా సినిమాని తెరకెక్కించారని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత ఇందులో ఎక్కువ శాతం వాస్తవాలే ఉన్నాయి ఎక్కడ క్రియేటివిటీ కనిపించడం లేదని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.