ఆ డబ్బులన్నీ మహేష్ బాబు ఫౌండేషన్ కే.. గొప్ప మనసు చాటుకున్న థియేటర్ నిర్వాహకులు?

ఆగస్టు 9వ తేదీ మహేష్ అభిమానులకు ఒక పండుగ రోజు అని చెప్పాలి. ఈరోజు కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు.ఇకపోతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాని తిరిగి విడుదల చేయాలని భావించారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇలా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాని మరోసారి థియేటర్లో విడుదల చేయడంతో ఇప్పటికే స్పెషల్ షోస్ కి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా బుక్ అయ్యాయి.అయితే ఈ స్పెషల్ షో ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం థియేటర్ నిర్వాహకులు మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.మహేష్ బాబు హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.

మహేష్ బాబు పలు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఎంతోమంది గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించి వారికి పునర్జన్మ ప్రసాదించిన ఘనత మహేష్ బాబుకుందని చెప్పాలి.ఇలా మహేష్ బాబు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన నటించిన పోకిరి సినిమాకి వచ్చే డబ్బులు మొత్తం మహేష్ బాబు ఫౌండేషన్ కి అందించాలని నిర్ణయం తీసుకోవడంతో నిర్వాహకుల మంచి మనసు పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు పోకిరి సినిమా రీ రిలీజ్ చేయడంతో ఈయన బాటలోనే మరి కొంతమంది హీరోలు సైతం వారి సినిమాలను తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.