ఒక్కసారిగా అందరి హీరో ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకున్న పవన్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలతో అలాగే మరోపక్క తన రాజకీయాల్లో మెయిన్ గా తన వారాహి యాత్రతో అయితే పవన్ పేరు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తుండగా పవన్ అయితే లేటెస్ట్ గా తన తోటి స్టార్ హీరోస్ పై చేసిన కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి.

అయితే పాలిటిక్స్ పరంగా పవన్ ని చాలా మంది హీరోల అభిమానులు కూడా పవన్ ని ద్వేషించే వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా వారు అందరూ కూడా పవన్ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అయితే సపోర్ట్ చేస్తున్నారు. వ్యక్తిత్వం పరంగా అయితే పవన్ ని ఎవరూ కామెంట్ చేయరు.

ఇప్పుడు అదే పవన్ కి ఇతర హీరోస్ లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది. పవన్ చేస్తున్న సహాయాలు లేటెస్ట్ గా తన జనవాణి కార్యక్రమంలో వెంటనే సమస్యలపై స్పందించిన విధానం అయితే సోషల్ మీడియాలో అందరి హీరోస్ ఫ్యాన్స్ ని అయితే కదిలించింది. కానీ ఇది మాత్రం ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి.

పవన్ కి అయితే ఇప్పుడు ఇతర హీరోస్ నుంచి కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. దీనితో ఒక్కసారిగా అందరి హీరోస్ అభిమానులు పవన్ తన వైపు తిప్పుకున్నారని చెప్పాలి. ఇదే కొనసాగితే మాత్రం ఈసారి ఎలక్షన్ లో అయితే వారు కూడా సపోర్ట్ చేస్తారో చూడాలి. ఇప్పుడు అయితే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజి చిత్రాలు షూటింగ్ బిజీగా ఉన్నాడు.