Alia Bhatt – Ranbir Kapoor : త్వరలోనే ఆలియా – రణ్ బీర్ కపూర్ పెళ్లి….? అందుకేనా ఈ షాపింగ్ ..?

Alia Bhatt – Ranbir Kapoor : బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పడూ వార్తల్లో ఉండే హీరో రణ్ భీర్ కపూర్. ఈ స్టార్ హీరోతో ఆలియా ప్రేమాయణం గురించి మొదట్లో రూమర్స్ అనుకున్నా చివరికి అదే నిజమైంది. తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ఇద్దరు నటీనటుల ప్రేమ విషయం తెలిసినప్పటి నుంచీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇన్ని రోజులూ రోజుకో విధంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

అయితే వీరిద్దరి పెళ్లిపై తాజాగా వచ్చిన మరో అప్డేట్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ వీరి పెళ్లిపై సరైన క్లారిటీ లేక, పలువురు పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా తాజాగా జరిగిన ఒక సంఘటన తో వారి పెళ్లి గంటలు త్వరలోనే మోగబోతున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రణభీర్ తల్లి నీతూ కపూర్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ లో కనిపించేసరికి ఇదంతా వారి పెళ్లి కోసమే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై వారిరువురి నుంచీ ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం.

ఇకపోతే తన తండ్రి మహేష్ బట్ వారసత్వంగా సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ, భారీ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ, RRRలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతోనూ ఆలియా తన నటనతో సినీ ప్రేక్షకులను అలరించింది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో రన్ భీర్, ఆలియా నటిస్తున్న విషయం తెలిసిందే.