రామాయణ ఇతివృత్తంతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కూడా రామాయణ ఇతివృత్తంతో వచ్చిన విషయం తెల్సిందే. ఆదిపురుష్ లో జానకి పాత్రను బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పోషించింది. ఇక గత కొన్నాళ్లుగా మధు మంతెన రామాయణం కథతో సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నితీష్ తివారి మరియు రవి ఉద్వావర్ దర్శకత్వంలో ఈ సరికొత్త రామాయణం సినిమా మూడు లేదా నాలుగు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాముడి పాత్రకు గాను రణబీర్ కపూర్ ను దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లే అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక జానకి పాత్రకు గాను ఆలియా భట్ ను సంప్రదించడం జరిగింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతుంది. అయితే రామాయణం సినిమాలో భర్తతో కలిసి నటించేందుకు ఆలియా నో చెప్పిందట.
బిజీ షెడ్యూల్ అంటూ ఆమె నకి పాత్రను చేసేందుకు నో చెప్పిందని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో సీత పాత్రను చేసిన ఆలియా భట్ మెప్పించలేక పోయింది. ఆ పాత్ర ఆలియాతో పాటు ఆమె అభిమానులకు కూడా నిరాశను మిగిల్చింది. అందుకే జానకి పాత్ర ను చేసేందుకు ఆలియా కి ఆసక్తి లేదని తెలుస్తోంది. ముందు ముందు జానకి పాత్రకు మేకర్స్ ఎవరిని కన్ఫర్మ్ చేస్తారో చూడాలి.