రాజమౌళి కోసం అలా మారిపోయానంటున్న అలియా భట్

alia bhatt revealed that how much she work hard for memorizing rrr telugu dailogues

రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్నా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు.ఈ సినిమాలో తన పాత్ర గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన అలియా భట్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చిన్నప్పుడు స్కూల్ లో ప్రశ్నలకు సమాధానాలను ఏ విధంగా బట్టీ పడతారో ఆర్ఆర్ఆర్ డైలాగ్ లను తాను అదే విధంగా బట్టీ పడుతున్నానని అలియా తెలిపారు.తనకు తెలుగు రాదని అందువల్లే డైలాగులను బట్టీ పడుతున్నానని ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సంవత్సరంన్నర నుంచి ఇదే పని చేస్తున్నానని అలియా తెలిపారు.ఆర్ఆర్ఆర్ డైలాగ్స్ ను తాను ఎంతలా బట్టీ పట్టానంటే నిద్రలో లేపి అడిగినా ఆ డైలాగ్స్ ను తాను చెప్పగలనని ఆమె అన్నారు.

alia bhatt

రాజమౌళి లాంటి డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడం తనకు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉందని అలియా భట్ వెల్లడించారు.లియా పాత్రకు సంబంధించి ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి కాగా త్వరలో చరణ్, అలియా కాంబినేషన్ లో సీన్లను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.షూటింగ్ మొదలు కాకముందే రాజమౌళి డైలాగ్స్ ఇచ్చారని అప్పటినుంచే అలియా ఆర్ఆర్ఆర్ మూవీ డైలాగ్స్ ను నేర్చుకుంటున్నారని సమాచారం.మరోవైపు అలియా భట్, రణ్ బీర్ కపూర్ ప్రేమలో ఉన్నారు.ఈ ఏడాదే రణబీర్, అలియాల పెళ్లి జరగాల్సి ఉన్నా లాక్ డౌన్ వల్ల వీరి వివాహం వాయిదా పడింది.వివాహ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని రణబీర్, అలియా భావిస్తుండటంతో వచ్చే ఏడాది వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.