రాజమౌళికి బాలీవుడ్ పొగరు చూపిస్తున్న అలియా భట్?

Alia Bhatt

బాలీవుడ్ బ్యూటీ ఆలియాపై  అటు చరణ్, ఎటు ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా మండి  పడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు!  తమ అభిమాన హీరోలు   నటిస్తున్నచిత్రంలో  నటించడానికి ఆమె లెక్కకు మించి కండీషన్లు పెడుతుందట. అందుకే ఇపుడు తాజాగా ఆలియాపై  ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎవ్వరికి ఇష్టం వచ్చినట్లు వారు పోస్టుల రూపంలో ఆలియాపై దాడికి దిగుతున్నారు. ఆలియా భట్  ఇంత పొగరుబోతా?! అంటూ కామెంట్లు విసురుతున్నారు.

Alia Bhatt

కరోనా తాకిడికి గత కొన్ని నెలలుగా  షూటింగులు లేక చిత్రసీమ  షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పాటిస్తూ తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాల షూటింగులకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల షూటింగులు మొదలైపోయాయి. ఇక అక్టోబర్ నుండి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల  షూటింగుల్లో పాల్గొనబోతున్నారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి  రూపొందిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ మాత్రం వెనకబడి పోతున్నాయి. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు.. అలాగే ఆలియాభట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్లతో పాటు మరికొంతమంది ఫేమస్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా… వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు  చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. యూనిట్ లో గాని, జూనియర్ ఆర్టిస్టుల్లో గాని ఏ ఒక్కరు కరోనా బారిన పడినా ఆ ప్రభావం తీవ్రంగా షూటింగ్ మీద పడుతుందని అందరికీ తెలిసిందే. అందుకే ముందుగా రాజమౌళి.. ఎన్టీఆర్ పై సోలో షాట్  తీసి అతనికి సంబంధించిన టీజర్ ను రెడీ చేసి విడుదల చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

కానీ ఇప్పుడు ఆలియా ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తుంది. చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ పెట్టిన కండిషన్  రాజమౌళిని కన్ఫ్యూజన్ లో పడేసి టెన్షన్ పెడుతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో ఆలియా కి సంబంధించిన సీన్లు  ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కాని పూణె షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కుదరనే లేదు. కాగా ఇప్పుడు ఆలియా అక్టోబర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు డేట్లు ఇ స్తానని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ లేదా జనవరికి ఆలియా కి సంబంధించిన సీన్లు  అన్ని కంప్లీట్ చేయాలని రాజమౌళికి చెప్పిందట. అందుకు కారణం ఇప్పటికే ఆలియా కొన్ని బాలీవుడ్ సినిమాలు కమిటయి, ఆ సినిమాలకి డేట్లు  ఇవ్వడమే అని తెలుస్తుంది. ఆలియా ఇలా కండీషన్ పెట్టడంతో ఎన్టీఆర్.. ‘కొమరం భీమ్’ టీజర్ మీద ఎఫెక్ట్ పడుతుందని అతడి అభిమానులు సైతం తీవ్రంగా ఆలియా మీద కోపంతో ఉన్నట్లు వాళ్ళ పోస్టుల చూస్తే తెలుస్తోంది.