ఆందోళనకరంగా ఆరోగ్యం… హాస్పిటల్ చేరుకున్న మహేష్ బాబు?

సూపర్ స్టార్ కృష్ణ ఆనారోగ్యం పాలవడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనకు మెరుగైన చికిత్స నిమిత్తం గచ్చబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.గత కొద్దిరోజులుగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి కృష్ణకు నేడు ఈ సమస్య తీవ్రతరం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని హాస్పిటల్ కి చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో కృష్ణకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

గత కొద్ది రోజుల క్రితం కృష్ణ సతీమణి మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మరణించడంతో ఒక్కసారిగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఏడాదిలోపే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అలాగే తల్లి ఇందిరా దేవి మరణించడం ఘట్టమనేని కుటుంబానికి తీరని లోటని చెప్పాలి.ఇంకా తన తల్లి మరణ వార్త నుంచి మహేష్ బాబు కుటుంబ సభ్యులు బయటపడక ముందే తిరిగి తన తండ్రికి అనారోగ్యం చేయడంతో మహేష్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తల రావడంతో ఆయన క్షేమంగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇకపోతే కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న టువంటి ఆయన కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్ కు చేరుకున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.