క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. అక్కినేని నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం టాకీ పార్ట్ కంప్లీటయిన ఈ సినిమా తిరిగి రీసెంట్ గా మళ్ళీ షూటింగ్ మొదలైంది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, లిరికల్ సాంగ్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.
ఇక చైతూ తమ్ముడు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మరో రొమాంటిక్ లవ్ స్టోరీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు కంప్లీటయిన రష్ చూసి నాగార్జున ఈ సినిమా మీదా చాలా నమ్మకంగా ఉన్నారని అందరూ చెప్పుకుంటున్నారు. నాగార్జున జడ్జిమెంట్ ఎప్పుడు తప్పలేదు కాబట్టి చిత్ర యూనిట్ కూడా ధీమాగా ఉన్నారట.
కాగా తాజాగా అందుతున్న సమారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. లాక్ డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమా రీసెంట్ గా మళ్ళీ చిత్రీకరణ మొదలైంది. అఖిల్, పూజా హెగ్డే లకి సంబంధించిన సీన్స్ ని ప్రస్తుతం భాస్కర్ తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ అక్కినేని సోదరులు ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.
నాగ చైతన్య, సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అఖిల్ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయాలని.. దాదాపు డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఈ యంగ్ హీరోలకి వకీల్ సాబ్ షాకివ్వబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ని దిల్ రాజు సంక్రాంతి బరిలో దింపబోతున్నాడట. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ ని అందుకుంటుందో చూడాలి.