నిహారిక పెళ్లిలో స్టార్స్ ఎంత మంది ఉన్నా అందరి చూపు ఆ కుర్రాడిపైనే..

akira nandan

మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో నిహారిక పెళ్లి వేడుకలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచే పెళ్లికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో మొదలయ్యాయి. మెగాస్టార్ చేతుల మీదుగా పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక నేడు చైతన్య భార్య కాబోతోంది. ఇక గత రాత్రి రావాల్సిన కుటుంబ సభ్యులు మొత్తం వేడుకకు వచ్చేశారు. ఎంగేజ్మెంట్ కు మిస్సయిన పవన్ కళ్యాణ్ కూడా వేడుకకు వచ్చేశాడు.

అయితే వేడుకలో అల్లు హీరోలతో పాటు మెగా యువ హీరోలంతా ఒక ఫ్రేమ్ లో కనిపించి అభిమానులకు మంచి కిక్కిచ్చారు. అయితే వారు ఎంత మంది ఉన్నా కూడా చాలా వరకు అభిమానుల ఫోకస్ మాత్రం ఒక కుర్రాడిపై పడినట్లు ఈజీగా అర్ధమయ్యింది. అతను మరెవరో కాదు పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్. రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నప్పటికి పిల్లలు అకిరా, ఆధ్య మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంటున్నారు.

mega heros

ఇక ఆధ్య, అకిరా పవన్ కళ్యాణ్ తో కలిసి ఉదయ్ పూర్ కి ఫ్లైట్ లో వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి వేడుకలో ట్రెడిషినల్ లుక్ లో ఆరడగుల అందగాడిగా అకిరా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. మెగా హిరోలందరితో కలిసి ఫొటో కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం.