అకిరా నందన్.. ఫ్యాన్స్ ధాటికి షాక్!

శుక్రవారం బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. ఇక సినిమాకు విభిన్నమైన తరహాలో టాక్ అయితే వస్తోంది. ఏదేమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అయితే సినిమా మంచి కిక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఆయన హై వోల్టేజ్ స్టైలిష్ లుక్ తో పాటు ఆయన ఎనర్జీ కూడా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది అని అనిపిస్తోంది.

ఇక మాస్ థియేటర్లలో అయితే ఈ సినిమాకు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇక ఈ తరుణంలో సరసరి మాస్ థియేటర్లోకి పవర్ స్టార్ వారసుడు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పవర్ స్టార్ పెద్ద కుమారుడు ఆకిరానందన్ కు ఫాన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అతను స్టార్ హీరో అవుతాడు అని అందరూ ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు.

అతని ఎంట్రీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇక అతను టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడు అనే విషయం తర్వాత సంగతి కానీ అతను ఎక్కడికి వెళ్లినా కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక హైదరాబాదులోనే సుదర్శన్ థియేటర్కు అకిరా ఆడియోన్స్ తో పాటు సినిమా చేసేందుకు వచ్చాడు.

సరాసరి అతను మాస్ ధియేటర్లోకి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను అనుకుంటే ప్రత్యేకంగా ఫ్యామిలీతో స్పెషల్ షో వేసుకుని మరి చూడొచ్చు. కానీ బందోబస్తు సెట్ చేసుకొని మాస్ ధియేటర్ లోకి దిగాడు అంటే మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ చూడడం కోసమే అని అర్థమైంది. ఇక అతనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. థియేటర్లో నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఫ్యాన్స్ అతన్ని చూసి ఎగబడ్డారు. ఇక భారీగా బందోబస్తు ఉండడంతో చాలా కఠినమైన పరిస్థితుల్లో తన కారు ఎక్కాల్సి వచ్చింది.