అఖిల్ బాగా పర్సనల్‌గా తీసుకున్నట్టున్నాడు.!

ఓ సినిమాని అందులో నటించిన నటీనటులు భుజానికెత్తుకుని ప్రమోషన్స్ చేస్తోంటే, చూడముచ్చటగా వుంటుంది. కొందరు హీరోలు లైట్ తీసుకుంటుంటారు.. కొన్నిసార్లు నిర్మాణ సంస్థలూ సరిగ్గా పట్టించుకోవు. హీరోయిన్ల సంగతి సరే సరి.

‘ఏజెంట్’ సినిమా విషయంలో మాత్రం చిత్ర యూనిట్ చాలా కష్టపడుతోంది ప్రమోషన్ల విషయంలో. అఖిల్ అయితే, సినిమా షూటింగ్ కోసం కష్టపడినట్లే, ప్రమోషన్స్ కోసం కూడా కష్టపడుతున్నాడు.

చిత్రంగా నాగచైతన్యగానీ, నాగార్జునగానీ ‘ఏజెంట్’ ప్రమోషన్లలో కనిపించడంలేదు. సినిమాపై పూర్తి నమ్మకంతో వున్న అఖిల్, తన సోలో ప్రమోషన్స్‌తోనే సత్తా చాటాలనుకుంటున్నట్టున్నాడు.

కాదు కాదు, నాగ్ త్వరలో జాయిన్ కాబోతున్నాడన్న ప్రచారమూ జరుగుతోంది. అఖిల్ ఇంత హంగామా చేస్తోంటే, సినిమా హట్టేనన్న నమ్మకం బలపడుతోంది సినిమా విడుదలవకముందే అక్కినేని అభిమానులకి. గతంలో హోల్ ఫ్యామిలీ ప్రచారం చేసినా, అఖిల్ సినిమాలు అంతగా నిలదొక్కుకోలేకపోయాయ్.!