బిగ్ బాస్ 4: అఖిల్ మాస్టర్‌ ప్లాన్ : ఫేస్ తెలియని దగ్గర్నుంచి ఫైనల్ రేస్‌కు..పాపం మోన‌ల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చేవరకు 90 శాతం జనాలకు తెలియదు. రెండు, మూడు చిన్న సినిమాల్లో అతడు నటించాడని చెప్తోన్నా, అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో, పోయాయో తెలీదు. అందుకే సీజన్ ప్రారంభంలో ఇంట్లోకి తెలిసినవారిని ఎవర్ని పంపలేదు అంటూ వీక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. అలాంటి అఖిల్ ఈరోజు విన్నింగ్ రేసులో ఉన్నాడు. వాస్తవానికి అతడు ఏ టాస్కులోని 100 శాతం ప్రదర్శన ఇవ్వలేదు. గెలిచిన దాఖలాలే లేవు. దీంతో అతడు కెప్టెన్ అవ్వడం కలే అనుకున్నారు వీక్షకులు. అయితే సీక్రెట్ రూమ్ లో ఉంచి..కొత్త డ్రామాకు తెరలేపి..బిగ్ బాస్ నిర్వాహకులే అతడిని కెప్టెన్‌ను చేసి పంపించారు. మేకగా వెళ్లి పులిలా వచ్చానంటూ అతడు చెప్పిన డైలాగ్స్ తో..అభి ఎంత ఫన్ రైజ్ చేశాడో అందరం చూశాం.

ఇంతవరకు రావడానికి కారణం వారిద్దరే :
అయితే అఖిల్ కు ఇంత స్థాయి ఇచ్చింది అభిజిత్ అండ్ మోనల్. అవును..మొదట అభి..మోనల్ తో ట్రాక్ రన్ చేశాడు. ఈ మధ్యలో అఖిల్ మోనల్ ను తన వైపు లాగే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. కొద్దికాలం ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. దీంతో అఖిల్ స్ట్రాంగ్ అయ్యాడు. అతడికి అంత సీన్ ఇవ్వడం ఇష్టం లేని అభి..మోనల్ ను పూర్తిగా లైట్ తీసుకున్నాడు. కానీ అప్పటికే అఖిల్ గ్రాఫ్ పెరిగింది. అభితో వరస గొడవలు మరింత ఇమేజ్ తెచ్చాయి. ఇక మోనల్‌తో రిలేషన్ రన్ చేస్తూ…అఖిల్ మరో గేమ్ ప్లాన్ కు తెరతీశాడు.

నామినేషన్ల సమయంలో ఆమె పేరును పదే, పదే వాడుకోవడం. ఆమెను సవరదీయడం మొదలెట్టాడు. ఆటలో మనుగడ సాగించడానికి అఖిల్ మోనాల్‌ను ఉపయోగిస్తున్నాడని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. అలకలు, ముద్దులు, హగ్గులు..మాములుగా కాదు బిగ్ బాస్‌కు ఓ రేంజ్ ఫీడ్ అందించాడు. అతడికి కరాటే కళ్యాణి దగ్గర్నుంచి దేవీ వరకు మోనల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. కానీ అఖిల్ మాత్రం రోజురోజుకు ఆమెతో రిలేషన్ ముందుకు తీసుకువెళ్లాడు గానీ, తగ్గినట్లు ఎక్కడా కనిపించలేదు. మధ్యలో మోనల్‌ను నామినేట్ చేసి..ఆమెను స్ట్రాంగ్ చెయ్యడానికి అలా చేశానంటూ ఎబ్బెట్టు ఎమోషన్ పండించాడు. నిజానికి మోనల్ కాదు..అఖిలే ఆమెను అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మోనల్ మాత్రం అఖిల్‌తో రిలేషన్ విషయంలో సీరియస్‌గా కనిపిస్తోంది. పాపం ఆమె పరిస్థితి బయటకు వెళ్లాక ఎలా ఉంటుందో చూడాలి.