అలాంటివి అఖిల్ వద్దంటున్నాడు.!

‘ఏజెంట్’ దారుణంగా దెబ్బ తినేసింది. మామూలుగా అయితే ఎవరైనా ఇంత దెబ్బ తిన్నాకా, ఓ చిన్న సినిమా చేయాలనుకుంటారు. ఎలాగోలా ఈ డ్యామేజ్‌ని కాస్తయినా కవర్ చేసుకోవాలనుకుంటారు. కానీ, అఖిల్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడట.

ఇంత జరిగాకా కూడా తదుపరి సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడట. అఖిల్‌ది ఏం పోయింది. నిర్మాతలు కదా దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పుడీ అంశం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

నాగార్జునకి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఇటీవల అఖిల్ దగ్గరికి వెళితే, 70 నుంచి 80 కోట్లు బడ్జెట్ అయితేనే చేద్దాం, లేదంటే చూద్దాం అనేశాడట. ఇలాగైతే కష్టం అక్కినేని వారసుడా.! అంటూ అఖిల్ విషయంలో నిర్మాతలు చేతులెత్తేస్తున్నారట.