వంట మనిషితో అఖిల్ రచ్చ.. ఇలా ఎవ్వరూ ఊహించరు!

Akhil Akkineni With Kairavi Mehta

అక్కినేని అమలకు వంటలు వండటం రాదన్న సంగతి తెలిసిందే. పైగా ఇంట్లో నాగార్జుననే అప్పుడప్పుడు వండి పెడతాడని భర్తపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటుంది. అయితే మరి వారింట్లో ఎవరూ వండుతారు అనే ప్రశ్నకు అఖిల్ తాజాగా సమాధానం ఇచ్చేశాడు. ఓ మాస్టర్ చెఫ్ వారింట్లో చేరి ఏడాది అవుతోందట. ఆమె వండే వంటలు, మెయింటైన్ చేయించే డైట్ ఎంతో బాగుందని అఖిల్ కితాబిచ్చాడు.

Akhil Akkineni With Kairavi Mehta
Akhil Akkineni With Kairavi Mehta

కైరావి మెహతా అనే మాస్టర్ చెఫ్ తమకు వండి పెడుతుందని, న్యూట్రిషన్స్, స్పెషల్ డైట్ కోసం ప్రత్యేకంగా అన్ని రకాల వంటలు వండుతుందని అఖిల్ ప్రశంసించాడు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ పోస్ట్ చేస్తూ.. ఆపై ప్రశంసలు కురిపించాడు. నువ్ చేసే ప్రతీ పనిలో విజయం చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ మనం కలిసి ఏడాది అవుతున్నందుకు కంగ్రాట్స్ అంటూ చెఫ్ ఫోటోను అఖిల్ షేర్ చేశాడు.

Akhil Akkineni With Kairavi Mehta
Akhil Akkineni With Kairavi Mehta

ఆమె కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్టుగా ఓ పోస్ట్ చేసింది. ఈ ఏడాది ఎంతో అద్భుతమైన సవాళ్లతో కూడుకుంది.. ప్రతీ రోజూ ఎంతో ఎంజాయ్ చేశాను. నాగార్జున, అమల గారికి వండిపెట్టడం సంతోషంగా ఉంది అంటూ అఖిల్ షేర్ చేసిన ఫోటోను రీపోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు చెఫ్ చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.