సొంత కుంపటి పెట్టబోతున్న అక్కినేని అఖిల్.!

అఖిల్‌ని ఎలాగైనా స్టార్ హీరోగా చూడాలని నాగార్జున తపన పడుతున్నాడు. అందుకోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకూ నాలుగు సినిమాలొచ్చాయ్ అఖిల్ నుంచి. ఏ సినిమా ఆశించిన రిజల్ట్ అదుకోలేకపోయింది. పైగా డిజాస్టర్ టాక్‌తో దారుణంగా డిజప్పాయింట్ చేశాయ్ ఈ నాలుగు సినిమాలు.

లేటెస్ట్‌గా ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. కానీ, ఆ కష్టం కూడా వృధా అయిపోయింది. ఇదిలా వుంటే, తాజాగా అక్కినేని కాంపౌండ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన కథనాలు వినిపిస్తున్నాయ్.

అఖిల్ సొంతంగా ఓ బ్యానర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట. అంటే హీరోగా సినిమాలు మానేస్తాడా.? అంటే కాదట. టెక్నికల్‌గా తనకు కొంత స్పేస్ కావాలనుకుంటున్నాడట అఖిల్. అలా అని యాక్టింగ్ మానేయాలనుకోవడం లేదట. హీరోగా ఇకపై మినిమమ్ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, సొంత బ్యానర్‌లో సినిమాలు కూడా రూపొందిస్తాడట. అదీ సంగతి.