Balakrishna : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలో ప్రేక్షకులను థియేటర్ వద్దకు రప్పించి విజయం సాధించిన ఘనత బాలయ్య బాబు బోయపాటి కే చెందుతుంది. ఈ రోజుల్లో కూడా 100 రోజులు ఆడిన సినిమా గా చరిత్ర సృష్టించింది. అఖండ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బృందం అఖండ కృతజ్ఞత సభ ను ఘనంగా నిర్వహించారు.
అఖండ సినిమా కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు ఊపిరినిచ్చింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలను తెచ్చింది. దీంతో అఖండ టీమ్ తాజాగా హైదరాబాద్‌లో అఖండ సంబరాలు అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న బాలయ్య అన్ సీజన్‌లో ‘అఖండ’ చిత్రాన్ని విడుదల చేశామని అయిన కూడా మంచి విజయాన్ని అందుకుందని తెలిపారు.
అంతేకాదు అఖండ పాన్ వరల్డ్ చిత్రంగా నిలిచిందని పేర్కోన్నారు. అఖండ సినిమాను ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ ఆదరిస్తున్నారన్నారు. అఖండ పాకిస్థాన్‌లోను చెలరేగిపోతోందని తెలిపారు. అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయని మాట్లాడారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఖండ సినిమాను బోయపాటి శీను దర్శకత్వం చేసారు. ఈ సినిమా లో హీరోయిన్ గా ప్రగ్య జస్వాల్ నటించింది. ఇందులో బాలయ్య ద్విపాత్రభినయం చేసారు. విలన్ గా చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ అలరించారు. ముఖ్య పాత్రాలలో జగపతి బాబు,పూర్ణ నటించారు.సినిమా బాలయ్య అభిమానులకే కాసు అందరికి నచ్చింది. ప్రకృతిని, సనాతన ధర్మాలను కలిపి చెప్పిన తీరు బాగానే నచ్చింది.