షాకింగ్ : దిల్ రాజుపై అజిత్ ఫ్యాన్స్ ఆగ్రహం..స్టోరీ ఏంటంటే.!

Dil raju

దిల్ రాజు టాలీవుడ్ నిర్మాతగా పరిచయం చెయ్యక్కర్లేని పేరు అయితే ఇప్పుడు తాను తమిళ్ సహా ఇండియన్ మార్కెట్ లో కూడా పలు సినిమాలు నిర్మాణం వహిస్తూ కీలకంగా మారారు. ఇక ఇలా ఇప్పుడు తమిళ్ సహా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న సినిమాలు వారసుడు మరియు చరణ్ 15 సినిమాలు కాగా..

ఆల్రెడీ విజయ్ తో చేస్తున్న సినిమాపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కూడా అందరికీ అర్ధం అవుతుంది. దీనితో అయితే విజయ్ సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరించినా మరో హీరోని తక్కువ చేస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సౌత్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారింది.

అయితే తమిళ్ లో విజయ్ మరియు అజిత్ ఇద్దరూ ఇద్దరే ఇద్దరి సినిమాలు కూడా భారీ వసూళ్లు రాబడతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇద్దరు ఇద్దరే అంటారు కానీ అజిత్ కన్నా విజయ్ నే పెద్ద స్టార్ అని అందులోని ఓ టాప్ నిర్మాత స్టేట్మెంట్ ఇవ్వడం షాకింగ్ గా మారింది.

మార్కెట్ పరంగా ఎవరు నెంబర్ 1 హీరో అనేది ఫ్యాన్స్ లో కొట్టుకుంటారు కానీ ఓ నిర్మాత ఇలాంటి మాట జారడం అనేది అసలు దేనికి దారి తీస్తుందో అర్ధం చేసుకోవాలి. దీనితో దిల్ రాజు కామెంట్స్ తో అయితే ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా టాలీవుడ్ శ్రేణులు కూడా దిల్ రాజు కామెంట్స్ తో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.