ఎన్టీఆర్ కి జంటగా భారీ పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్ ..?

కొంతమంది టాలెంటెడ్ హీరోయిన్స్ కి అవకాశాలు రావడం లేటవుతుందేమో గాని రావడం మాత్రం పక్కా. అలాంటి ఒక హీరోయిన్ కి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఊహించని అవకాశం దక్కినట్టు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. ఆ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అని సమాచారం. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోనూ నటించింది.

World Famous Lover on Valentine's Day: Aishwarya Rajesh plays a typical  housewife to Vijay Deverakonda | Telugu Movie News - Times of India

అయితే ఈ రెండు సినిమాలు ఐశ్వర్య రాజేష్ కి టాలీవుడ్ లో సక్సస్ ని ఇవ్వలేకపోయాయి. కాని మంచి పర్ఫార్మర్ గా గుర్తింపు తో పాటు పేరు తీసుకు వచ్చాయి. దాంతో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ అన్న సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాకి నిన్నుకోరీ, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా దాదాపు సగానికి పైగా టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం.

కాగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ లో ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ వచ్చిందని, అది కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించబోతుందని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరెస్ నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నాడట రాజమౌళి. ఇదే గనక నిజమైతే ఐశ్వర్య రాజేష్ కి ఊహించని గొప్ప అవకాశం దక్కిందని చెప్పాలి.