ఆహా ఓటీటీ ప్లాట్ఫారం లో ఓహో అనేలా ప్రోగ్రామ్స్.. తాజాగా హై ఎనర్జీ డాన్స్ రియాలిటీ షో తో మన ముందుకు!

ఆహా తెలుగులో మొదటి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ దీని వ్యవస్థాపకులు. 2020 మార్చి 25న అధికారికంగా ఈ యాప్ ని లాంచ్ చేశారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్స్ ని, రియాలిటీ షోస్ ని టాక్ షోస్ ని ప్రజెంట్ చేస్తూ సరికొత్త ఎంటర్టైన్మెంట్ ని అందజేస్తూ ఉంటుంది. 100% తెలుగు కంటెంట్తో ఓటీపీ ఫీల్డ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది ఈ యాప్. అలాగే థియేటర్లో సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు తీసుకొని వస్తుంది.

ఇప్పుడు ప్రసారమవుతున్న ఆహా ఒరిజినల్ తెలుగు ఇండియన్ ఐడెల్ సీజన్ 3 కి కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఇప్పుడు మళ్లీ సరికొత్త హై ఎనర్జీ డాన్స్ రియాలిటీ షో ని మన ముందుకి తీసుకురాబోతోంది ఆహా టీం. ఎంతో ప్రతిభావంతులైన డాన్సర్స్ సెలబ్రిటీస్ అత్యంత ప్రసిద్ధ పోస్టుతో ఈ షో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

యాక్టింగ్ తో పాటు కొరియోగ్రఫీ లో అనుభవం ఉన్న నటి ఈ షో కి జడ్జిగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ డాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్లు హిప్ హాప్ క్లాసికల్ తో పాటు అన్ని రకాల డాన్సింగ్ ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ షో 2025లో ప్రారంభిస్తారని సమాచారం పూర్తి వివరాలని త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారని చెప్పింది ఆహా టీం. ఇక ఈ ఆహా ఫ్లాట్ ఫామ్ లో ఇప్పటికే పలు షూస్ ప్రదర్శించగా అది సూపర్ హిట్ అయ్యాయి.

బాలకృష్ణ పోస్ట్ గా నటిస్తున్న అన్ స్టాప్ షో కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి ఈ షో సక్సెస్ తో ఆహా యాప్ వాల్యూస్ ఎక్కడికో వెళ్లిపోయాయి. అలాగే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో కూడా ఏ యాప్ ముందుంటుంది. అందులో భాగంగానే గత నెలలో ఎవరు చేతులకి ఆహ్వానం పలికింది ఈ యాప్. ఎస్ కే యం మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ డైరెక్టర్ సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్స్ తో కలిపి టాలెంట్ హంట్ ఏర్పాటు చేసింది.