ఆహాహా.! బాలయ్యకి అదిరిపోయే పేమెంటు.!

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాను రాను ‘ఆహా’కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారు. ఆ మధ్య ‘అన్‌స్టాపబుల్’ అంటూ సందడి చేసిన నందమూరి బాలకృష్ణ, ఇప్పుడేమో ఆహాలో మరో సింగింగ్ షో‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు ‘ఆహా’ కంటెంట్.. వెరసి బాలయ్య బీభత్సమైన బిజీగా వున్నాడు. వీటితోపాటు కమర్షియల్ యాడ్స్ కూడా.! రియల్ ఎస్టేట్ కంపెనీలు, గోల్డ్ జ్యుయెలరీ సంస్థలూ.. అబ్బో, బాలయ్య హంగామా అంతా ఇంతా కాదు.

ఇంతకీ, బాలయ్య వీటి ద్వారా ఎంత సంపాదిస్తున్నారట.? కోట్లు వెనకేసుకుంటున్నాడు బాలయ్య.. అన్న చర్చ అయితే జరుగుతోంది. ‘ఆహా’ నుంచే కనీ వినీ ఎరుగని స్థాయిలో బాలయ్యకు పేమెంట్లు వస్తున్నాయట.

ఇవ్వొచ్చు.. ఎంతైనా ఇవ్వొచ్చు.. ఎందుకంటే, బాలయ్య ‘ఆహా’ వేదికగా ప్రదర్శిస్తోన్న ఎనర్జీ అలాంటిది. అన్నట్టు, ‘ఆహా’ ద్వారానే ‘జై బాలయ్య’ నినాదం మరింతగా జనాల్లోకి వెళ్ళిపోతోందండోయ్.!