మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలని దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే ఒక్కో హీరోకి ముందు ఓ ట్యాగ్‌ను తగిలించారు. మెగా స్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, యంగ్ టైగర్, మెగా ప్రిన్స్, యువ సామ్రాట్, సూపర్ స్టార్.. ఇలా అభిమానులు వారికి నచ్చిన పేర్లతో తమ హీరోలను పిలచుకుంటున్నారు. అయితే ఒక హీరో ట్యాగ్ ఇంకొకరికి చేరిందంటే అభిమానులు ఉగ్రరూపం దాల్చడం ఖాయం. తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది. అల్లు అర్జున్ ముందు ఆహా అనే సంస్థ మెగాస్టార్ అని చేర్చడంతో చిరంజీవి ఫ్యాన్స్ రచ్చ చేశారు.
ఇద్దరు మెగా హీరోలే అయినప్పటికీ, చిరంజీవికి తప్ప మెగాస్టార్‌ని ఎవరకు ఉపయోగించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. దీంతో ఓటీటీ సంస్థ ఆహా దిగి రాక తప్పలేదు. వివరాలలోకి వెళితే సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చిరంజీవి, విజయ్ దేవరకొండ, రకుల్, చిరంజీవి, అల్లు అర్జున్ పాల్గొన్నారు. చిరంజీవికి సంబంధించిన ఎపిసోడ్‌ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ న్యూ ఇయన్ గిఫ్ట్‌గా జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది.
అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో బన్నీకు ముందు “మెగాస్టార్” అని రాసుకొచ్చారు. ఇది చూసి చిర్రెత్తిపోయిన చిరు ఫ్యాన్స్ ‘ఆహా’పై తీవ్రంగా మండిపడ్డారు. మెగాస్టార్ బిరుదుకు ఎవరు అర్హులు కాదంటూ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో తమ తప్పు తెలుసుకున్న ఆహా సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ తప్పుతో ఏడాదిని ముగిస్తున్నాము. ఎర్రర్ వలన ఇలా జరిగింది. మనకు ఒకే ఒక్క మెగాస్టార్ ఉన్నారు. ఆయన ఎవరో మనందరికి తెలుసంటూ బదులిచ్చింది. అయితే అంతకు ముందు ఎపిసోడ్లో చిరంజీవి పాల్గొన్నందున మెగాస్టార్ అనే ట్యాగ్‌ను తీసేయడం టెక్నికల్ టీమ్ మర్చిపోయినట్లు కొందరు భావిస్తున్నారు.
It’ the last day of a crazy year. So, let’s forgive, forget and step into 2021 with love, light and laughter! 🧡 pic.twitter.com/9CDluQ1U90
— ahavideoIN (@ahavideoIN) December 31, 2020