‘ఏజెంట్’ ఇన్ సైడ్ రిపోర్ట్.! బ్లాక్ బస్టర్ పక్కా.!

‘ఏజెంట్’ సినిమాని మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అనుకున్న స్థాయి కన్నా భారీగానే బజ్ క్రియేట్ కావడంతో, సినిమాకి బిజినెస్ కూడా బాగా జరిగిందని అంటున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.

టెక్నికల్‌గానూ సౌండింగ్ అదిరిపోయిందట. బహుశా అదే అఖిల్ కాన్ఫిడెన్స్ కావచ్చేమో. సినిమాపై పక్కా నమ్మకంగా వున్నాడు అఖిల్. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తున్నారు.

అక్కినేని అభిమానుల్ని కూడా యాక్టివ్ చేశారట. సోషల్ మీడియా వేదికగా కొన్ని టీమ్స్ ఈ సినిమా ప్రమోషన్లలో ప్రత్యేకంగా పని చేస్తున్నాయని తెలుస్తోంది.

నాగార్జున తెర వెనకే వుండి మొత్తం కథ నడిపిస్తున్నాడట. ఇంతవరకూ అఖిల్ సినిమాలకు అంతా తానే అయ్యి, తెర ముందు కూడా తానే కనిపించేవాడు నాగార్జున.

కానీ, ఈ సారి ట్రెండ్ మార్చాడు. అఖిల్‌ని ముందుంచి తెర వెనుక తానుండి కథ నడిపిస్తున్నాడట. అఖిల్ కూడా బాగానే కష్టపడుతున్నాడు. కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు ఇంతకు ముందుతో పోల్చితే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ సాక్షి వైద్య ఈ సినిమాలో అఖిల్‌తో జత కడుతోంది.