అఖిల్ అక్కినేని హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఏజెంట్. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజాగా మూడో అప్ డేట్ వచ్చింది. ఏప్రిల్ 28వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్లు చేయకపోవడం గమనార్హం. రిలీజ్ అవుతున్న పాటలు కూడా పెద్దగా హిట్టు కాకపోవడంతో… సినిమాకు తగినంత బజ్ ఏర్పడలేదు.
అయితే ఏజెంట్ సినిమా విడుదలకు కేవలం మూడు వారాల సమయమే ఉండగా.. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా కూడా మేకర్స్ ఎలాంటి టీజర్ లేదా సాంగ్, ఇంకేదైనా వీడియో కూడా విడుదల చేయలేరు. కేవలం ఓ పోస్టర్ ను మాత్రమే విడుదల చేశారు. అందులో అఖిల్ ఫొటో అదిరిపోయింది. అయితే ఏజెంట్ సినిమా చేస్తామని ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ కు కూడా పెద్దగా సెన్సేషన్ అ్వడం లేదు.
కేవలం విడుదలకు మూడు వారాల సమయమే ఉన్న ఈ సినిమాకు ప్రమోషన్లు లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ ప్రమోషన్లు ఏమాత్రం సరిపోవడం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా చిత్రబృందం ప్రమోషన్లు మొదలెట్టాలని అంతా సూచిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో వాల్తేరు వీరయ్య కోసం మెగాస్టార్ చిరంజీవి, దసరాకి న్యాచురల్ స్టార్ నాని లాంటి వారు అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలు ఇస్తూ.. అనేక టీవీ షోలలో కూడా నటిస్తూ తమ సినిమాలను చాలా ఘాటుగా ప్రమోట్ చేశారో మనం చూశాం. కానీ అఖిల్ ఏజెంట్ సినిమాకు సంబంధించి కేవలం పోస్టర్ల ద్వారానే శుభాకాంక్షలు విడుదల చేస్తోంది.
అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేయాలంటే రియల్ టైమ్ యాక్షన్‌ను మార్కెట్ లోకి తీసుకురాలేదు. అయితే సినిమాను ప్రమోట్ చేసేందుకు ఇటు అఖిల్ కానీ అటు సురేందర్ రెడ్డి కానీ ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. నిర్మాత అనిల్ సుంకర ఏం చేస్తున్నారా అని అంతా అనుకుంటున్నారు. మరి చూడాలి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో.
