ఏజెంట్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే?

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి ఈ మూవీని స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఆవిష్కరించారు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలలో ఇప్పటికే కంప్లీట్ అయింది.

అఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ డీల్స్ ఈ మూవీకి జరగడం విశేషం. నైజాంలో ఏజెంట్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ ఏరియాలో 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఆంధ్రాలో 14.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 29.30 కోట్ల థీయాట్రికల్ వ్యాపారం జరిగింది.

కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.80 కోట్లు, ఓవర్సీస్ లో 3.10 కోట్ల బిజినెస్ డీల్స్ ఏజెంట్ మూవీపై జరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా 36.20 కోట్లు బిజినెస్ ఏజెంట్ మూవీ చేయడం విశేషం. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోయిన అఖిల్ మార్కెట్ రేంజ్ కి నుంచే బిజినెస్ అయ్యిందని చెప్పాలి. అయితే మూవీకి 80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఆ స్థాయిలో సినిమా కలెక్షన్స్ రావాలంటే మాత్రం ఏజెంట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే.

తెలుగు, మలయాళీ సక్సెస్ అయితే హిందీ మార్కెట్ లో కూడా కొంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా మంచి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను అందిస్తుంది.