లేటెస్ట్ న్యూస్ : తమిళ స్టార్ హీరోకి గాయాలు..కావాలనే సింపతీ చేస్తున్నాడా.?

తమ సినిమాల కోసం అనేక మంది నటులు హీరోలు ఎంతలా కష్టపడతారో తెలిసిందే. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో చాలా వరకు హీరోలు అయ్యితే తమ ఒళ్ళు సినిమా కోసం హూనం చేసేసుకుంటారు. కొత్త కొత్త పాత్రలు ఏక్షన్ సీక్వెన్స్ లు కోసం ఓ రేంజ్ లో కష్టపడతారు.

మరి అలా వారు అనేక ప్రమాదాలకు కూడా గురయ్యిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి తాజాగా అయితే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర గాయాల పాలయినట్టుగా కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు మార్క్ ఆంటోనీ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతుండగా ఈ సినిమా ఒక ఏక్షన్ సన్నివేశంలో విశాల్ బాగా గాయాలకు లోనయ్యినట్టుగా తెలుస్తుంది.

అయితే విశాల్ విషయంలో ఇది రెగ్యులర్ గా జరుగుతున్న పనిలా మారిపోయింది. జస్ట్ కొన్ని వారాల కితమే విశాల్ తన మరో చిత్రం షూటింగ్ లో అనేక సార్లు ప్రమాదానికి లోనయ్యాడు. అయితే ఇదంతా చూస్తుంటే కేవలం ఏదో సింపతీ కోసమే అన్నట్టు అనిపిస్తుంది..

అక్కడ విశాల్ విషయంలో ఎన్నో కాంట్రవర్సీలు, సినిమాలు కూడా పెద్దగా ఆడటం లేదని ఇలాంటి న్యూస్ లతో కాస్త పాజిటివ్ ఒపీనియన్ బయటకి వెళ్తే అయినా సినిమాలకి ఏమన్నా ఓపెనింగ్స్ వస్తాయేమో అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.