సామ్ భారీ సినిమాకి మరోసారి దెబ్బ.!

సమంత హీరోయిన్ గా కంటే ఇప్పుడు ఆమే మెయిన్ లీడ్ గా పలు సినిమాలు మరియు సిరీస్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో ఆల్రెడీ భారీ పాన్ ఇండియా సినిమా యశోద తన కెరీర్ లో భారీ హిట్ కాగా దీనితో ఆ సినిమా తర్వాత రానున్న సినిమా “శాకుంతలం” పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఇది యశోద కన్నా భారీ బడ్జెట్ సినిమా కావడంతో దీనిపై మరిన్ని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా ఇది ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అయితే తెరకెక్కింది. మరి అంతా బాగానే ఉంది ఈ ఫిబ్రవరి లోనే రిలీజ్ అనుకున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు వాయిదా పడినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ ఈ సినిమా గత ఏడాదిలోనే రిలీజ్ కావాలి కానీ ఫిబ్రవరి కి జరిపారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ డేట్ నుంచి చిత్ర యూనిట్ సినిమాని జరుపుతున్నారు. దీనితో రిలీజ్ టెన్షన్ ఈ సినిమాకి పట్టుకుంది. మరి అనుకున్న రేంజ్ బిజినెస్ జరగలేదో లేక వేరే కారణాలు ఉన్నాయో కానీ..

సినిమా అయితే మళ్ళీ వాయిదా పడినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు అలాగే గుణ ఆర్ట్స్ మరియు దిల్ రాజు లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. ఇక కొత్త డేట్ అయితే ఇంకా బయటకి రావాల్సి ఉంది.