Pawan Fans : ఇండస్ట్రీ బజ్ : మళ్ళీ పవన్ ఫ్యాన్స్ కి నిరాశే..సిద్ధంగా ఉండండి.!

Pawan Fans : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ మసాలా చిత్రం “భీమ్లా నాయక్”. మలయాళ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం కి రీమేక్ గా సాలిడ్ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోవచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ పలు కారణాల చేత వాయిదా వేశారు. దీనితో ఆల్ మోస్ట్ రిలీజ్ అయ్యిపోతుంది అనుకున్న సినిమా ఆగిపోయి ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ పవన్ అభిమానులకు నిరాశ తప్పదు అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరి వారు చెబుతున్న దాని ప్రకారం మళ్ళీ ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందట. ఒకవేళ ఫిబ్రవరిలో ఆగిపోతే మార్చ్ లోనే రిలీజ్ అన్నట్టు అంటున్నారు. ఇప్పటికి అయితే మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ చిత్ర యూనిట్ ఇవ్వట్లేదు. సో ఫైనల్ గా మళ్ళీ వాయిదా తప్పదు అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్రలో నటిస్తుండగా నిత్యా, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సో పవన్ ఫ్యాన్స్ అయితే దేని కోసం అయినా రెడీగా ఉండాల్సిందే..