బిగ్ అప్డేట్ : జవాన్ తర్వాత అవైటెడ్ “యానిమల్” టీజర్ వచ్చేస్తుంది… 

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ సినిమా మార్కెట్ ఉన్నటువంటి బాలీవుడ్ నుంచి ఓ రేంజ్ లో అయితే సినిమాలు వస్తూ భారీ హిట్స్ అవుతున్నాయి. దీనితో బాలీవుడ్ సినిమాకి పూర్వ వైభవం రాగ అక్కడ హీరోస్ కూడా ఇప్పుడు అంతా రియాలిటీకి వచ్చి ఒక్క బాలీవుడ్ దర్శకులు తోనే కాకుండా పాన్ ఇండియా దర్శకులతో అయితే సినిమాలు చేస్తున్నారు.

అలా ఇప్పటికే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసి ఇప్పుడు సెన్సేషనల్ చిత్రం “యానిమల్” తో సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో జవాన్ సినిమా ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అందులో మాత్రం కంటెంట్ లోపం ఖచ్చితంగా ఉంది.

దర్శకుడు అట్లీ తన సినిమాలు శంకర్ సినిమాలు కలిపి తీసి జవాన్ చేసాడు. దీనితో సందీప్ వంగ పొటెన్షియల్ చూసిన వారు అంతా ఇక క్వాలిటీతో కూడిన యానిమల్ రిలీజ్ కోసం చూస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ తో చేసిన ఈ సినిమా పై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రీ టీజర్ లకు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు ఫైనల్ గా మెయిన్ టీజర్ కి ఇప్పుడు మేకర్స్ డేట్ ఖరారు చేశారు. ఈ సెప్టెంబర్ 28 రణబీర్ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ టీజర్ ఏ లెవెల్లో ఉంటుందో సందీప్ ఎలా చూపిస్తాడో అని అంతా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.