ఇన్సైడ్ టాక్ : “ఏజెంట్” ఫ్లాపైనా అయ్యగారు మరో ప్రయోగం.?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఏజెంట్” బహుశా తన కెరీర్ లోనే  భారీ ప్లాప్ అని చెప్పొచ్చు. ఎన్ని అంచనాలు మధ్య వచ్చిన తన మొదటి సినిమానే అప్పట్లో మొదటి రోజే 8 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. ఏది.. దాదాపు ఏడేళ్ల కితం అది.

అలాంటి మార్కెట్ ని అఖిల్ బాగానే మైంటైన్ చేస్తూ వచ్చాడు కానీ అనుకోని విధంగా ఏజెంట్ విషయంలో మాత్రం బాగా లేట్ అవ్వడంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఈ చిత్రానికి వచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాగా ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ మరో ప్రయోగాత్మక చిత్రంతో అయితే అయ్యగారు రానున్నట్టుగా తెలుస్తుంది.

భారీ చిత్రం సాహో కి వర్క్ చేసిన యంగ్ దర్శకుడు సుజీత్ దగ్గర పని చేసిన అనీల్ అనే యంగ్ దర్శకుడు అయితే అఖిల్ తదుపరి సినిమా కోసం ఇంట్రెస్టింగ్ కథని ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా అయితే ఓ కంప్లీట్ ఫాంటసీ డ్రామాగా ఉంటుంది అట. అంటే అఖిల్ లో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ సినిమాకి కూడా ఫిక్షనల్ అండ్ ఫాంటసీ లో ఉంటుంది అని తెలుస్తుంది.

అయితే ఏజెంట్ లాంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత మళ్ళీ ఎక్స్ పెరిమెంట్ అంటే కాస్త ఆలోచించాలి అని చెప్పాలి. కాగా మరో పక్క దర్శకుడు వంశీ పైడిపల్లి తో కూడా సినిమా ఉందని రూమర్స్ ఉన్నాయి. మరి అసలు ఏజెంట్ దెబ్బతో అఖిల్ అసలు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది.