రెండేళ్ల తర్వాత మళ్ళీ విజయ్ తో భారీ నిర్మాణ సంస్థ?

తమిళ సినిమా నాట భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోస్ లో దళపతి విజయ్ కూడా ఒకడు. కాగా విజయ్ హీరోగా నటించిన తన గత చిత్రం “లియో” తన కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ హిస్టరీ లోనే ఓ భారీ రన్ ని సొంతం చేసుకుంది. దీనితో తన నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమాని టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభుతో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ చేసే సినిమా కోసం సోషల్ మీడియాలో హాట్ బజ్ నడుస్తుంది. దీనితో విజయ్ తో మళ్ళీ రెండేళ్ల తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి.

లాస్ట్ టైం ఇదే నిర్మాణ సంస్థతో “బీస్ట్” అనే సినిమా విజయ్ చేయగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యినప్పటికీ 200 కోట్ల మేర గ్రాస్ ని అందుకుంది. అలాగే దీనికి ముందు “సర్కార్” అనే సెన్సేషనల్ హిట్ కూడా వారి కాంబినేషన్ లో ఉంది.

దీనితో ఇప్పుడు మరో సినిమా దాదాపు ఖరారు అని ఇప్పుడు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాని గ్యాంగ్ స్టర్ సినిమాల స్పెషలిస్ట్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తాడని అంటున్నారు. దీనితో విజయ్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి ఇపుడు నెలకొంది. అలాగే దీనిపై సర్ప్రైజింగ్ అప్డేట్ కూడా వస్తుందని భోగట్టా.