సుప్రియ లీడ్ రోల్‌లో అడవి శేష్ మూవీ.!

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ లీడ్ రోల్‌లో ఓ మూవీ రూపొందబోతోందట. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది సుప్రియ.

సింగిల్ మూవీ హీరోయిన్‌గా స్టాంప్ వేయించుకుని వెళ్లిపోయింది. అయితే, యాక్టింగ్ నుంచి తప్పుకుని నిర్మాణంలో రాణిస్తోంది సుప్రియ. మొన్నా మధ్య అడవి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమాతో మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది. అక్కడి నుంచి యాక్టింగ్ పైనా ఫోకస్ పెట్టింది.

హీరోయిన్ సెంట్రీక్ మూవీస్ చేయాలని అనుకుంటోందట. అందులో భాగంగానే ఓ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాతో సుప్రియ ప్రేక్షకుల ముందుకు రానుందట.

ఈ సినిమాలో హ్యాండ్సమ్ హీరో అడవి శేష్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడనీ సమాచారం. కేవలం కొద్ది నిముషాల నిడివి మాత్రమే వుండే గెస్ట్ రోల్‌లో అడవి శేష్ కనిపించబోతున్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.