ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ హీరోల మార్కెట్ రేంజ్ పెరగడంతో వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేస్తున్నారు. ఇక హిందీలో కూడా స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ లేకపోయిన వంద కోట్లకి పైనే ఖర్చు చేస్తున్నారు. అయితే అక్కడ సినిమాలు చాలా వరకు ఫెయిల్యూర్ బాట పడుతున్నాయి.
సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. అదే సమయంలో టాలీవుడ్ లో సక్సెస్ పర్సంటేజ్ పెరిగింది. ఇక బాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా లెవల్ లో యూనివర్శల్ కథలని, సూపర్ హీరో స్టోరీస్ ని రెడీ చేసుకుంటూ గ్రాండియర్ గా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. అందులో అశ్వత్థామ ఒకటి. ఆదిత్య ధర్ ఈ సినిమాని విక్కి కౌశల్ తో స్టార్ట్ చేశారు. ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో అనుకున్నారు.
అయితే కొంత షూటింగ్ కంప్లీట్ అయ్యింది. విక్కీ కౌశల్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లో కొన్ని సీక్వెన్స్ తెరకెక్కించారు. సడెన్ గా కరోనా విపత్తు వచ్చింది. ఇక రెండేళ్ళ తర్వాత దీని నుంచి కోలుకొని మరల మూవీ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. సౌత్ మార్కెట్ కోసం సారాని తప్పించి సమంతని తీసుకున్నారు. ఇంతలో నిర్మాత రోని స్క్రూవాలా తప్పుకున్నారు.
అతి కష్టం మీద ఆదిత్య ధర్ జియో వారిని ఒప్పించారు. ఇక హీరోగా విక్కీ కౌశల్ వద్దని వారు తేల్చేశారు. ఈ నేపధ్యంలో సౌత్ నుంచి తారక్, యష్ ని సంప్రదించారు. అయితే వారు ఈ మూవీ చేయడానికి ఎందుకనో విముఖత చూపించారంట. తరువాత రణవీర్ సింగ్ ని సంప్రదించారు. అతను శక్తిమాన్ ప్రాజెక్ట్ చేస్తూ ఉండటంతో అశ్వత్థామపై ఆసక్తి చూపించలేదు.
మూవీ లేట్ అవుతుందని సమంత కూడా తప్పుకుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అయ్యేలా లేదని జియో వారు తప్పుకున్నారంట. ఇక ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం వారు 30 కోట్ల వరకు వెచ్చించారంట. అయితే 350 కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే ఇప్పుడే వదిలేస్తే బెటర్ అనుకోని పక్కకు తప్పుకున్నారంట. అయితే ఆదిత్య ధర్ మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.