వైరల్ : హర్షసాయి హీరోగా సినిమాకి “ఆదిపురుష్” టెక్నీషియన్.!

తెలుగు సోషల్ మీడియాలో సహా యూట్యూబ్ ఫ్లాట్ ఫామ్ లో కూడా ఓ సంచలనం హర్ష సాయి అనే పేరు. అయితే తాను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలతో అయితే ఎంతో క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. దీనితో తనపై ఓ పక్క పాజిటివ్ తో పాటుగా నెగిటివ్ కూడా ఉన్నప్పటికీ తనని అభిమానించే వాళ్ళు మాత్రం తగ్గలేదు.

అయితే హర్ష సాయి సినిమాల్లోకి వస్తాడని రాజకీయాల్లోకి వస్తాడని పలు ఊహాగానాలు రాగా హర్ష సాయి మాత్రం రాజకీయాలకి దూరంగా ఉంటానని తెలిపాడు. అయితే లేటెస్ట్ గా తాను హీరో గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం రంగం సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది.

కాగా హర్ష సాయి ని నిర్మాత మిత్ర శర్మ హీరోగా పరిచయం చేస్తుండగా తన సినిమా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అయితే మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ చిత్రానికి ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ చిత్రం అయినటువంటి “ఆదిపురుష్” కి విజువల్స్ ని అందించిన టెక్నీషియన్ వర్క్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. .

అతను కార్తీక్ ఫలని కాగా తాను ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇది మాత్రం ఊహించనిదే అని చెప్పాలి. ఇక ఈ చిత్రం ఎలా ఉంటుందో ఇతర డీటెయిల్స్ మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి. హర్ష సాయి మాత్రం ఓ ఊహించని టాలీవుడ్ డెబ్యూ అయితే ఇచ్చేలా ఉన్నాడని చెప్పాల్సిందే.