అట్టర్ ఫ్లాపయిన పూరి హీరోయిన్ ..సోషల్ మీడియాని మాత్రం వేడెక్కిస్తోంది ..!

పూరి జగన్నాధ్ హీరోల తో పాటు కొత్తగా పరిచయం చేసిన హీరోయిన్స్ .. అలాగే సక్సస్ లు లేని హీరోయిన్స్ కి ఫేట్ మార్చేస్తాడన్న పేరుంది. పూరి హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా లాంగ్ కెరీర్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకు ఉదాహరణ అనుష్క శెట్టి నే. సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్క శెట్టి ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. పూరి దగ్గర కథ లు ఎలా అయితే కుప్పలు కుప్పలు ఉంటాయో.. మోడల్స్ కి సంబంధించిన ఫొటోస్ కూడా అలాగే ఉంటాయి.

Adah Sharma: I like to take risks

అందులోనుంచే పూరి దాదాపు తన సినిమాలకి హీరోయిన్స్ ని ఫిక్స్ చేస్తుంటాడు. గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ తోను నిధీ అగర్వాల్, నభా నటేష్ లకి మంచి కెరీర్ ఇచ్చాడు. అయితే పూరి జగన్నాధ్ యంగ్ హీరో నితిన్ తో తీసిన హార్ట్ ఎటాక్ సినిమాతో అదా శర్మ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అదా టాలీవుడ్ లో ఎక్కువకాలం కొనసాగుతుందని భావించారు. కాని ఆ అంచనాలన్ని తారుమారయ్యాయి. అదా లో టాలెంట్ ఉంది. గ్లామర్స్ క్యారెక్టర్స్ కి అడ్డు చెప్పదు.. స్కిన్ షో చేసేందుకు వెనకాడదు.

Heart Attack Movie New Stills | Attack movie, Telugu movies, Movie photo

కాని ఎందుకనో అదా మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. హార్ట్ ఎటాక్ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత సినిమాలలో రావాల్సిన అవకాశాలు రాక సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ తో పాటు కొన్ని వీడియోస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. వాటిలో కొన్ని బెల్లి డాన్స్ వీడియోస్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తున్నాయి. ఈ వీడియోస్ చూసిన ఫ్యాన్స్ అదా కి టాలీవుడ్ లో మంచి ఛాన్సులు రావడం లేదని ఫీలవుతున్నారట. పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ లో టాలీవుడ్ లో గొప్ప కెరీర్ లేదంటే అదా శర్మ కే అంటున్నారు.