చిత్రపరిశ్రమలో ఎంతో మంది ప్రతిభ కలిగిన నటీనటులున్నారని, అలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు రాకపోవడం ఎంతో బాధగా ఉందని యువ నటి శ్రీనిహ అన్నారు. ’50`50’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలి పాత్ర ద్వారా తమిళ వెండితెరకు పరిచయమైన శ్రీనిహ ‘ఆణ్ దేవతై’, ‘సైకో’, హీరో సంతానం నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఇంగే నాంగ దాన్ కింగు’ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.
ప్రస్తుతం ‘8 తోట్టాగల్’ ఫేం వెట్రి, సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. హీరోయిన్‌గా నటించడానికి అన్ని రకాల అర్హతలున్నప్పటికీ ఆమెకు కేవలం చిన్నచిన్న పాత్రలకే పరిమితమైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు తన సినీ ప్రయాణంపై ఆమె స్పందిస్తూ..’కంటెంట్ బాగుంటే ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్ధంగా ఉన్నాను. నృత్య శిక్షణ సమయంలో ఉన్నప్పుడు తొలిసారి మోడలింగ్‌లో అవకాశం రావడంతో అంగీకరించి అప్పటినుంచి అనేక వాణిజ్య ప్రకటనలో నటించానని తెలిపింది.
తర్వాత సినిమాల్లో నటించే అవకాశం వరించిందరని, దర్శక ద్వయం జేడీ–జెర్రీలతో కలిసి పనిచేశానుని తెలిపింది. అయితే ఆ తరహా ఒకే తరహా, గ్లామర్ ఎక్స్‌పోజింగ్ పాత్రలు వరుసగా వస్తుండటంతో వాటిని నిరాకరించానని పేర్కొంది. కథ డిమాండ్ చేస్తే గ్లామర్‌గా నటించడంలో తప్పులేదనీ, కేవలం సినిమా కోసం గ్లామర్‌గా నటించడం ఇష్టం లేదు. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించాలన్నది నా కోరిక.
సంతానంతో కలిసి నటించడం మంచి అనుభవం. ఆయన నన్ను కోలీవుడ్ ప్రియాంకా చోప్రాగా వర్ణించడం మరిచిపోలేని అనుభూతి. తమిళ చిత్రపరిశ్రమలో కేవలం హీరోయిన్ పాత్రలకు మాత్రమే కాకుండా, ఇతర పాత్రలకు కూడా తమిళ కళాకారులకు అవకాశాలివ్వాలన్నారు. విలన్‌తో సహా అన్ని రకాల పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు.