Gallery

Home News తెలుగమ్మాయి కాబట్టి ఇక్కడ ఛాన్సులు రావన్నందుకు దుమ్ము దులిపేస్తున్న రీతూ వర్మ ..!

తెలుగమ్మాయి కాబట్టి ఇక్కడ ఛాన్సులు రావన్నందుకు దుమ్ము దులిపేస్తున్న రీతూ వర్మ ..!

ఎప్పటి నుంచో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్స్ గా అవకాశాలివ్వరు అన్న మాట చాలామంది చెబుతూనే ఉన్నారు. నచ్చావులే సినిమాతో పాపులర్ అయిన మాధవీలత లాంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాగే హీరోయిన్ గా టాలీవుడ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన తెలుగమ్మాయి రీతూ వర్మ విషయంలో కెరీర్ ప్రారంభంలో ఇలాంటి మాటలే వినిపించాయి.

Happy Birthday Ritu Varma: From Yevade Subramanyam To Kanulu Kanulanu  Dochayante, Here Are The Actress' Four Best Performances | The Times Of  India

‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్ లో మొదటిసారి నటించిన రీతూ వర్మ ఈ షార్ట్ ఫిల్మ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. దాంతో తెలుగులో ‘ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యం సినిమాలలో చిన్న పాత్రలు పోషించి గుర్తింపు పొందింది. ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్ళి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా పాపులారిటీ సాధించింది.

Hyderabadi Beauty Ritu Varma To Romance Nani - Tollywood

అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే ఇప్పుడు తెలుగు సినిమాలలో వరసగా అవకాశాలు వస్తున్నాయి. మేకర్స్ ఇప్పుడు రీతూ వర్మ డేట్స్ కోసం వేయిట్ చేస్తున్నారంటే ప్రస్తుతం తెలుగులో తన డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Naga Shaurya And Ritu Varma'S Film Launched In Hyderabad | Telugu Movie  News - Times Of India

ఇప్పటికే నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు శర్వానంద్ నటించే తెలుగు, తమిళ సినిమాతో పాటు నాగ శౌర్య కి జంటగా ఒక సినిమా కమిటయింది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ లో రూపొందబోతున్న ఖిలాడి సినిమాలో కూడా రీతూ వర్మ ఒక హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తుంది. ఇవే కాదు నందమూరి కళ్యాణ్ రామ్ నటించబోతున్న సినిమాలో కూడా రీతూ వర్మ ని హీరోయిన్ గా ఎంచుకున్నారట. మొత్తానికి తెలుగమ్మాయి కదా అని తీసిపారేసినందుకు ఇప్పుడు వరసగా అవకాశాలు అందుకుంటూ అందరికీ షాకిస్తోంది.

- Advertisement -

Related Posts

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

కరోనా మూడో వేవ్ ముప్పు: కనీస బాధ్యత లేని రాజకీయం.!

కరోనా సెకెండ్ వేవ్ ముప్పు దాదాపు తగ్గిందనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా రోడ్డెక్కేశారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల ప్రచారం కోసం జనాన్ని సమీకరించే ప్రయత్నాలు.....

Latest News