ఆ మ్యూజిక్ డైరక్టర్‌తో ప్రగతి.. షాపింగ్ మాల్‌లో రచ్చ

Actress Pragathi With GV Prakash

టాలీవుడ్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎలా రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో కూడా బాగా తెలుసు. అలా తెలుసు కాబట్టే నేడు ప్రగతికి ఇంతటి ఫాలోయింగ్ పెరిగింది. లాక్డౌన్‌లో వచ్చిన క్రేజ్‌తో ప్రగతి దశ తిరిగిపోయింది. తెరపై కొత్త రకమైన పాత్రలను పోషించే చాన్స్ వస్తోంది. ప్రగతి వేసిన డ్యాన్సులు, చేస్తోన్న వర్కవుట్లకు తగిన ప్రతిఫలం దక్కినట్టుంది.

Actress Pragathi With GV Prakash
Actress Pragathi With GV Prakash

ప్రగతి ఒకప్పటిలా ఎమోషనల్ మదర్ పాత్రలే కాకుండా ఫైటింగ్ చేసే స్ట్రాంగ్ లేడీగానూ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రగతి చేతిలో పలుప్రాజెక్ట్‌లున్నాయి. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా మధ్యలో వెరైటీ ఫోటో షూట్‌లతో సందడి చేస్తోంది. ప్రగతి ఇప్పుడు ఓ సినిమాలో తల్లి పాత్రను పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. హీరో, నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ నటిస్తోన్న సినిమాలో ప్రగతి నటిస్తోంది.

అయితే ఈ మధ్య జీవి ప్రకాష్‌తో దిగిన ఫోటోలనే ప్రగతి షేర్ చేస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో చాలానే సీన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ ఇద్దరిపై షాపింగ్ మాల్‌లో సీన్స్ షూట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు షాపింగ్ మాల్‌లో ఎక్సలేటర్‌రపై ఓ సీన్ తెరకెక్కిస్తుండగా దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేసినట్టు లేరు. పైగా ఇది కేవలం తమిళంలోనేనా లేదా తెలుగులోనూ రిలీజ్ చేస్తారా? అన్న క్లారిటీ కూడా లేదు.