KGF 2: అలా అనుకుంటే కేజీఎఫ్ ప్లాప్…. డైరెక్టర్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసిన అర్చన…!

KGF2 : కేజీఎఫ్ ఫ్రాంచైస్ లో వచ్చిన రెండు సినిమాలు ఇంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇంకా కేజీఎఫ్ 2 వసూళ్లు తగ్గడం లేదు. కొంత మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా రుచించక పోయిన మెజారిటీ ప్రేక్షకులకు మాత్రం సినిమా బాగా నచ్చేసింది. సినిమాలో హీరో ఎలేవేషన్ మామలుగా ఉండదు. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 లో యష్ కు ఇచ్చిన హైపర్ మరింత పెంచి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు డైరెక్టర్ ప్రశాంత్.

ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఇపుడు బాగా ఫేమస్ అయ్యారు మీడియా వేల ఇంటర్వ్యూ లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఇక సినిమా లో తల్లి పాత్రలో నటించిన అర్చన జోయిస్ కీ కూడా బాగా క్రేజ్ పెరిగింది. పలు ఛానెల్స్ కు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఆమె తల్లి సొంతూరు కోలార్ ప్రాంతం అవ్వడం మరో విశేషం. పలు ఇంటర్వ్యూల్లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలని ఆమె పంచుకుంటున్నారు.

అలానే సినిమాగురించి ప్రశాంత్ నీల్ ఆలోచనలను కూడా ఆమె చెప్పి షాక్ ఇచ్చారు. ఈ సినిమా మదర్ సెంటిమెంట్ సినిమా కాదని ఎవరైనా అంటే కేజీఎఫ్ ప్లాప్ అని అర్థం అని ఆయన చెప్పారట. సినిమా కథ మొత్తం వివరించకుండా కేవలం తన పాత్ర గురించి మాత్రమే అర్చన జోయిస్ కు చెప్పారట ప్రశాంత్. ఇక పార్ట్ 3 లో తాను ఉన్నానో లేదో ఇంకా తెలియదని వివరించారు. ఉగ్రమ్, కేజీఎఫ్ రెండు భాగాలతో హ్యాట్రిక్ అందుకున్న ప్రశాంత్ ఏపీ మాజీ మంత్రి రఘువీర రెడ్డి బంధువట.