ప్రియుడితో తాప్సీ రహస్య వివాహం!

సౌత్‌, నార్త్‌ ఇండస్టీల్రో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ముందు వరుసలో ఉంటుంది. తెర బయట సైతం ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తుంటుందన్న పేరుంది ఆమెకు.

కాగా, తాజాగా ఈ పంజాబీ భామ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్‌ బాయ్‌ఫ్రెండ్‌, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు మాథియాస్‌ బో ను రహస్యంగా పెళ్లాడినట్లు సమాచారం. మార్చి 23న ఉదయ్‌పూర్‌లో ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు బాలీవుడ్‌ విూడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మార్చి 20న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే వీరి వివాహానికి హాజరైనట్లు సమాచారం.

త్వరలో ముంబైలో తమ స్నేహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. తాప్సీకి అత్యంత సన్నిహితులు షేర్‌ చేసిన ఫొటోలు వీరి పెళ్లి వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. తాప్సీ బెస్ట్‌ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక, బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. వారు షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు పెళ్లి విషయంపై తాప్సీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

కాగా, మాథియాస్‌ బోతో తన ప్రేమ గురించి తాప్సీ ఇటీవలే బయట పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి మాథియాస్‌ బోతో ప్రేమలో ఉన్నానని చెప్పింది. ’దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయమైంది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. అయితే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. మాథియాస్‌ బోతో నేను చాలా సంతోషంగా ఉన్నా. బ్రేకప్‌ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ రాలేదు’ అని చెప్పుకొచ్చింది తాప్సీ.