‘పుష్ప: ది రూల్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. హిందీ భాషా ప్రేక్షకులు ఈ సినిమాను ఆరాధిస్తూ మాస్, రూరల్ ప్రాంతాల్లో అంచనాలను పెంచుతున్నారు. బీహార్‌లో పాట్నా నగరంలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన జనసంద్రం చూస్తేనే సినిమా హిట్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నార్త్ ఇండియాలో ఇంతటి గొప్ప ఈవెంట్ జరగడం ఇండియన్ ఫిలిం హిస్టరీలో అరుదైన విషయమని పలువురు వ్యాఖ్యానించారు.
ఇక ఈవెంట్ ద్వారా అల్లు అర్జున్ నార్త్ ఫాలోయింగ్ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే వేడుకపై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న జనాన్ని ప్రస్తావిస్తూ, ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదని, జేసీబీ పని చేస్తుంటేనూ జనాలు గుమిగూడతారని సెటైరిక్‌గా మాట్లాడాడు. అలాగే రాజకీయ సభలకు బీరు బిరియాని వల్లే జనం వస్తారని చెప్పిన సిద్ధు, వాళ్ళందరూ గెలుస్తున్నారా? అని కౌంటర్ వేశాడు. జనాలు గుమిగూడటం సక్సెస్‌కు కొలమానం కాదని కూడా వ్యాఖ్యానించాడు.
సిద్ధు నటించిన ‘మిస్ యు’ చిత్రం ‘పుష్ప-2’ విడుదలకు వారం ముందే రావాల్సింది. అయితే అప్పుడు కంటెంట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలుపుతూ, తమ సినిమాతోనే పోటీ పడతామనే ధైర్యాన్ని చూపించారు. కానీ చివరికి వర్షాల కారణంగా చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు ‘పుష్ప-2’ ప్రభంజనం కొనసాగుతుండగా, మరోసారి సిద్ధు చేసిన వ్యాఖ్యలు ఆడియెన్స్‌ను ఆకర్షించలేకపోయాయి. సోషల్ మీడియాలో సిద్ధు వ్యాఖ్యలపై పుష్ప-2 ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన గాంభీర్యాన్ని ఎద్దేవా చేస్తూ విమర్శలు చేస్తున్నారు.