నటుడు శివాజీ కొత్త సినిమా అనౌన్స్‌!

మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌ ద్వారా బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ ఫుల్‌గా స్టార్ట్‌ చేశాడు టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శివాజీ. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ తర్వాత మళ్లీ అదే బ్యానర్‌లో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు శివాజీ. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ అనౌన్స్‌ చేసి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

శివాజీ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ ఎస్‌ఎల్‌ఆర్‌ సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్‌ చూస్తే.. లవ్‌ స్టోరీ అని తెలుస్తుంది. ఎస్‌ఎల్‌ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ’కూర్మ నాయకి చిత్రంలో కూడా శివాజీ కీలక పాత్రలో నటించబోతున్నాడు.