వైరల్ : రోజాకి సరైన ఆన్సర్ ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ.!

YSRCP-MLA-Roja (1)

ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నటి అలాగే ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే సహా మంత్రి అయినటువంటి రోజా సెల్వమణి టాలీవుడ్ స్టార్ హీరో అందులోని టాలీవుడ్ పెద్ద దిక్కు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అలాగే చిరంజీవి ఫ్యామిలీ హీరోస్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం మరోసారి సంచలనంగా మారింది.

దీనితో చిరు అభిమానులు మరోసారి రోజా పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ కి సపోర్ట్ చేయకపోతే చిన్న ఆర్టిస్టులని వారు బెదిరిస్తారు అనే కామెంట్స్ పై లేటెస్ట్ గా టాలీవుడ్ నటుడు సీనియర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ రోజా కి సరైన సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“నన్నెప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపైన్ చేయమని అడగలేదు పార్టీ లో చేరమని కూడా అడగలేదు చిన్న ఆర్టిస్టులే కదా ఎందుకు భయపడతారు” అని రోజా వ్యాఖ్యలకి గాను రిప్లై ఇచ్చారు. దీనితో బ్రహ్మాజీ ఇలా బయటకొచ్చి స్పందించడంతో మెగా ఫ్యాన్స్ కి మరింత అండగా మారింది.

దీనితో హైపర్ ఆది, గెటప్ శ్రీనుతో పాటుగా బ్రహ్మాజీ లాంటి నటులు కూడా స్పందించడం మెగా ఫ్యామిలీ పై చేస్తున్న నిరాధార ఆరోపణలు నిజం కాదు అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి రోజా ఇంతలా మెగా ఫ్యామిలీ ని ఎందుకు టార్గెట్ చేస్తుందో ఆమెకే తెలియాలి.