విలక్షణ నటుడు బ్రహ్మాజీ తెరపై ఎంత సందడి చేస్తాడో.. సోషల్ మీడియాలో అంతకు మించి రచ్చ చేస్తాడు. ట్రోలింగ్, సెటైర్లు, రూమర్లకు అంతే స్థాయిలో కౌంటర్లు వేస్తుంటారు. ఇక బ్రహ్మాజీ టాలీవుడ్ సెలెబ్రిటీలను ఆడుకునే తీరు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. సాయి ధరమ్ తేజ్, వెన్నెల కిషోర్, లావణ్య త్రిపాఠి, రాహుల్ రవీంద్రన్‌లతో చేసే కామెంట్లు వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.
ఆ మధ్య తన తదుపరి ప్రాజెక్ట్‌లపై వచ్చిన రూమర్లపై ఓ రేంజ్‌లో కౌంటర్లు వేశాడు. రాహుల్ రవీంద్రన్.. దర్శకత్వంలో బ్రహ్మాజీ ఓల్డేజ్ గెటప్‌లో నటిస్తాడని, యాభై యేళ్ల వయసులో పాతికేళ్ల వయసున్న అమ్మాయికి మధ్య కలిగే ప్రేమ నేపథ్యంలో ఆ చిత్రం ఉండబోతోందని రూమర్లు వినిపించాయి. ఇక ఈ మేరకు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. నేరుగా రాహుల్ రవీంద్రన్‌ను ప్రశ్నంచాడు. అలాంటి స్క్రిప్ట్ రెడీ చేశావా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు అంటూ కౌంటర్ వేశాడు.
అది అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక నేడు బ్రహ్మాజీ మరో పోస్ట్ చేశాడు. పెళ్లి గెటప్‌లో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ మేరకు బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది. మరోసారి పెళ్లి.. కానీ ఇది ఎన్నోసారి అన్న విషయం మరిచిపోయాను అంటూ సెటైర్ వేశాడు. అయితే ఇది సినిమా షూటింగ్ కోసమని ఇట్టే అర్థమవుతోంది. కానీ మూవీకి సంబంధించిన విశేషాలేవీ ప్రకటించలేదు.