వైజయంతి విజయాలకు అపశకునం!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా దూసుకుపోతోంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, మహర్షి, జాతి రత్నాలు, సీతారామం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రతేకం. ఇక సీతారామం సినిమా అయితే గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రిలీజ్ అయిన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటి అనే ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ బ్రాండ్ వేల్యూ కారణంగా తాజాగా స్వప్న సినిమాలో వచ్చిన అన్ని మంచి శకునములే మూవీకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

నందిని రెడ్డి చివరిగా సమంతతో ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాపై అందరికి నమ్మకం కలిగించి. అలాగే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి చూడగలిగే మూవీ వచ్చిందనే మాట వినిపించింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.

ఒక వర్గం ప్రేక్షకులని మెప్పించిన అది థియేటర్స్ కి భారీగా ఆడియన్స్ ని రప్పించే స్థాయి కాదు. దీంతో ఎవరేజ్ టాక్ తో ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఎవరేజ్ టాక్ వచ్చిన చిత్రాలు కూడా బిగ్ స్క్రీన్ పై బ్రేక్ ఎవెన్ సాదించలేకపోతున్నాయి. దీంతో డిజాస్టర్ లిస్టులోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అన్ని మంచి శకునములే మూవీ కూడా అదే కోవలోకి చేరిపోయేలా ఉందనే మాట వినిపిస్తోంది. స్వప్న సినిమా బ్యానర్ లో నాలుగు సూపర్ సక్సెస్ ల తర్వాత ఈ సినిమాతో ప్రియాంకా దత్ అంచనా ఫెయిల్ అయ్యిందనే మాట వినిపిస్తోంది.

మరో వైపు సంతోష్ శోభన్ కి కూడా అస్సలు లక్ ఏ మాత్రం ఫేవర్ చేయడం లేదని చెప్పాలి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే మూవీ చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత కల్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు తో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. అన్ని మంచి శకునములే మూవీతో మరో డిజాస్టర్ ని సొంతం చేసుకున్నారు. నటుడిగా తాను వందశాతం న్యాయం చేసిన కథలు మాత్రం ప్రేక్షకులని మెప్పించడం లేదనే మాట వినిపిస్తోంది.