బిచ్చగాడు 2 ట్రైలర్… అతన్ని చంపిందెవరు?

తమిళంలో విజయ్ ఆంటోనీ సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ కాకుండా కాస్తా డిఫరెంట్ వేలో కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోనీ తరువాత హీరోగా మారాడు. తాను హీరోగా మూవీస్ చేయడం కోసం సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మూవీస్ నిర్మిస్తున్నారు. ఆయన హీరోగా గతంలో బిచ్చగాడు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ మూవీ తెలుగులో సెన్సేషన్ హిట్అయ్యింది. తల్లిని రక్షించుకోవడం కోటీశ్వరుడు బిచ్చగాడుగా కొద్ది రోజులు జీవించడం అనే కాన్సెప్ట్ తో ఆ మూవీ తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. సెంటిమెంట్ ప్రధానంగా సాగడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తరువాత కూడా విజయ్ ఆంటోనీ సినిమాలు తెలుగులో కొంత వరకు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి.

తమిళంలో మాత్రం విజయ్ ఆంటోనీ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం బిచ్చగాడు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి విజయ్ ఆంటోనీ రెడీ అయ్యారు. ఈ సీక్వెల్ తో అతనుదర్శకుడిగా కూడా మారడం విశేషం. అలాగే ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. బిచ్చగాడు 2 ద్వారా రైటర్, డైరెక్టర్, ఎడిటర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ గా ఐదు విభాగాలను విజయ్ ఆంటోనీ హ్యాండిల్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రపంచంలో 7వ ధనవంతుడు అయిన విజయ్ గురుమూర్తి లక్ష కోట్లకి పైగా ఆస్తులకి వారసుడు. అయితే అనుకోకుండా విమాన ప్రమాదం జరవుతుంది. ఆ ప్రమాదంలో అతను మరణించాడని ప్రపంచం నమ్ముతుంది. అయితే విజయ్ గురుమూర్తిని అతనిలాగే ఉన్న సత్య హత్య చేసాడని నేరం ఆరోపించబడుతుంది. అతనిని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉంటారు.

సత్య కోటీశ్వరుడు అయిన విజయ్ గురు మూర్తిని హత్య చేశాడా? లేదంటే విజయ్ గురుమూర్తి సత్య ఒకరేనా?. ఇంతకీ బికిల్ వారిలో ఎవరు? విమాన ప్రమాదం ఎలా జరిగింది. విజయ్ గురుమూర్తి జీవితం ఎలా మొదలైంది. చిన్న వయస్సులో బిక్షాటన చేసుకుంటున్న ఆ అన్నా చెల్లి ఎవరు? ఇలాంటి ఇంటరెస్టింగ్ సస్పెన్స్ పాయింట్స్ తో బిచ్చగాడు 2 ట్రైలర్ ని విజయ్ ఆంటోనీ ప్రెజెంట్ చేసి మూవీపై హైప్ క్రియేట్ చేశారు. మే 19న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా బిచ్చగాడు స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందా అనేది చూడాలి.

Bichagadu 2 - Official Trailer | Vijay Antony, Kavya Thapar | Fatima Vijay Antony