మరోసారి స్మార్ట్ గేమ్ ప్లే చేసిన అభిజిత్… వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా తనకు తానే అవార్డు!

abijeet started smart game again

బిగ్ బాస్ లో శుక్రవారం నాడు ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టే కార్యక్రమానికి తెరతీశాడు బిగ్ బాస్. ఇప్పటివరకూ మీ పర్ఫామెన్స్‌ని పరిగణలోకి తీసుకుని ఈ ఇంట్లో ఏ ర్యాంక్‌కి సరిపోతారని అనుకుంటున్నారో.. ఆ ర్యాంక్‌కి మీరే ఎందుకు అర్హులో చెప్తూ పోరాడాల్సి ఉంటుందని.. ఈ చర్చల్లో ఫైనల్ ర్యాంక్‌లను బిగ్ బాస్‌కి తెలియజేయాల్సి ఉంటుందని ఫస్ట్ ర్యాంక్ మీద నిలబడిన సభ్యుడు బెస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా పరిగణించబడతాడు. ర్యాంక్ 6 మీద నిలబడిన సభ్యుడు వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా పరిగణించబడతారని చెప్పారు బిగ్ బాస్. అయితే ఒక ర్యాంక్ మీద ఒక సభ్యుడు మాత్రమే ఉండాలని కండిషన్ పెట్టారు బిగ్ బాస్. అఖిల్ ఇప్పటికే ఫినాలే మెడల్ పొంది ఫైనలిస్ట్ అయిన కారణంగా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు బిగ్ బాస్.

అయితే బజర్ మోగగానే సొహైల్ నెంబర్ 1 స్థానంలో నిలబడగా.. అరియానా నెంబర్ 2, హారిక నెంబర్ 3, మోనాల్ నెంబర్ 4 స్థానాల్లో నిలబడ్డారు. అయితే మైండ్ గేమర్‌గా పేరొందిన అభిజిత్.. తనకు ఆల్రెడీ ప్రేక్షకులు నెంబర్ 1 స్థానం ఇచ్చేశారని ఫిక్స్ అయ్యాడో ఏమో తెలియదు కానీ.. ఐదో స్థానంలో అవినాష్‌ని నిలబెట్టి మరీ చివరి స్థానంలో 6లో నిలబడ్డాడు. మిగిలిన ఇంటి సభ్యులు తమ తమ స్థానాల కోసం పోటీ పడితే అభిజిత్ మాత్రం.. తనకు ఆరో స్థానమే కావాలని చెప్పాడు.అప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతూ… ‘మీరే మీ ర్యాంక్‌లను ఎంచుకున్నారు.. సొహైల్ నెంబర్ 1 స్థానంలో ఉండటం వల్ల బెస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయ్యారని.. అభిజిత్ 6వ ర్యాంక్‌లో ఉండటం వల్ల వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా పరిగణిస్తూ.. తక్షణమే అభిజిత్‌ని జైలులోకి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బోరు బోరున ఏడ్చింది హారిక… వెంటనే అభిజిత్‌ని హగ్ చేసుకుని ఏడ్చేసింది.

అయితే అభిజిత్ నెంబర్ 6లో నిలబడటంతో తన గేమ్ స్ట్రాటజీ ఉపయోగించినట్టుగా అనిపిస్తోంది. మరోసారి స్మార్ట్ గేమ్ ప్లే చేశాడు. సీజన్ మొత్తం బాగా ఆడి వరస్ట్ పెర్ఫామర్ అనిపించుకుంటే.. ప్రేక్షకుల్లో సింపథీ పెరిగే అవకాశం ఉండనే ఉంది. మొత్తంగా నేటి ఎపిసోడ్‌లో అఖిల్ టికెట్ టు ఫినాలే గెలవడం.. సొహైల్ త్యాగం చేయడం.. అవినాష్ అద్భుతంగా ఇంటి సభ్యుల గురించి బుర్రకథ చెప్పడం.. అభిజిత్ తనని తాను వరస్ట్ పెర్ఫామర్ అని ప్రకటించుకోవడం అన్ని కూడాను శుక్రవారం ఎపిసోడ్ లో ఆసక్తికరంగా జరిగాయి.